ENGW vs AUSW : మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. లీద్ దశ నుంచి ఓటమెరెగని ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia) లార్డ్స్ మైదానంలో ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆల్‌రౌండర్లతో నిండిన ఇరుజట్లలో కప్‌ను ముద్దాడేది ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది.
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆరోసారి టాస్ ఓడిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ భారీ స్కోర్‌తో కంగారూలకు సవాల్ విసురుతామని చెప్పింది. అయితే.. సొంతగడ్డపై ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా వదలని ఇంగ్లండ్.. రెండోసారి టీ20 ఛాంపియన్ అవుతుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
Both England and Australia are unchanged as they battle for #T20WorldCup glory 🔥
Who are you backing to lift the trophy tonight? pic.twitter.com/UY7vRidrDO
— Cricinfo (@cricinfo) July 5, 2026
ఎందుకంటే.. ఇదివరకు మూడుసార్లు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు ఓటమి పాలైంది. కాబట్టి.. ఈసారి ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆతిథ్య జట్టు పట్టుదలతో ఉంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన టీ20ల్లో 23-21తో పైచేయి సాధించిన ఆసీస్.. వరల్డ్‌కప్‌లోనూ 5-2తో ఆధిపత్యం చెలాయించింది.
Australia have won the toss and bowl first in the #T20WorldCup final against England at Lord’s pic.twitter.com/qD9ZyXpmTh
— Cricinfo (@cricinfo) July 5, 2026
ఇంగ్లండ్ తుది జట్టు : అమీ జోన్స్(వికెట్ కీపర్), డానీ వ్యాట్ హొడ్గే, నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), అలీసే క్యాప్సే, హీథర్ నైట్, ఫ్రెయా కెంప్, డానీఎల్లే గిబ్సన్, చార్లొట్లే డీన్, లిన్సే స్మిత్, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్.
ఆస్ట్రేలియా తుది జట్టు : జార్జియా వోల్, బేత్ మూనీ(వికెట్ కీపర్), ఫొబే లిచ్‌ఫీల్డ్, ఎలీసా పెర్రీ, అషే గార్డ్నర్, జార్జియా వరేహం, అనాబెల్ సథర్లాండ్, నికోలా కారే, సోఫీ మొలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, లూసీ హామిల్టన్.