Prize Money: వరల్డ్‌కప్‌లో టాప్ 4 జట్లు ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నాయో తెలుసా ?
Prize Money: వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు .. ప్రైజ్‌మనీ కింద 4 మిలియన్ల డాలర్లు గెలుచుకున్నది. ఇక గ్రూపు స్టేజ్‌లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రైజ్‌మనీ మొత్తం 4.28 మిలియన్ల డాలర్లు. అంటే ఆస్ట్రేలియా ఈ టోర్నీ మొత్తంలో రూ.35.6 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నది.
ముంబై: ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో భారత జట్టును ఓడించిన ఆ జట్టు క్రికెట్ హిస్టరీలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు .. ప్రైజ్‌మనీ(Prize Money) కింద 4 మిలియన్ల డాలర్లు గెలుచుకున్నది. ఇక గ్రూపు స్టేజ్‌లో ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రైజ్‌మనీ మొత్తం 4.28 మిలియన్ల డాలర్లు. అంటే ఆస్ట్రేలియా ఈ టోర్నీ మొత్తంలో రూ.35.6 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నది. ఫైనల్లో ట్రావిస్ హెడ్ కీలకమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
రన్నరప్‌గా నిలిచిన ఇండియాకు ప్రైజ్‌మనీ కింద 2 మిలియన్ల డాలర్లు దక్కాయి. అయితే భారత జట్టు గ్రూప్ స్టేజ్‌లో మొత్తం 9 మ్యాచ్‌లను గెలుచుకున్నది. దీంతో ఆ జట్టుకు మొత్తం ప్రైజ్‌మనీ 2.36 మిలియన్ల డాలర్లు వచ్చింది. అంటే ఆ మొత్తం విలువ రూ.19.6 కోట్లు. సౌతాఫ్రికా ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. చివరకు మొత్తం రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ ఆ జట్టు గెలుచుకున్నది. ఇక న్యూజిలాండ్ జట్టు 5 మ్యాచ్‌లు గెలిచి మొత్తం రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ చేజిక్కించుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

