మెల్బోర్న్: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3/37), లియాన్(2/48) ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్ షఫీక్(62), కెప్టెన్ షాన్ మసూద్(54) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
కమిన్స్ ధాటికి ఇమాముల్హక్(10), బాబర్ ఆజమ్(1), సౌద్ షకీల్(9), సల్మాన్(5) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 187/3 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్(63) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.