Aaron Finch | అరోన్ ఫించ్ సంచలన ప్రకటన.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై..!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, టీ20 జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ (Aaron Finch) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
Aaron Finch | ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్, టీ20 జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ (Aaron Finch) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది సెప్టెంబర్‌లో వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న ఫించ్.. ప్రస్తుతం కేవలం టీ20లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
‘2024 జరగబోయే టీ20 ప్రపంచకప్ వరకు నేను ఆడలేకపోవచ్చని అర్థమైంది. ఫిట్ నెస్
సాధించలేకపోతున్నా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది.
వచ్చే ఏడాది మెగా టోర్నీ నాటికి జట్టును సమాయత్తం చేసేందుకు తగినంత సమయం ఉంటుంది. నాకు
మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తొలిసారి టీ20 ప్రపంచకప్ 2021, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేను’ అని ఫించ్ వెల్లడించారు.
ఫించ్ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచులు ఆడాడు. అందులో ఐదు టెస్టు సిసీస్లు కాగా, 146 వన్డేలు మ్యాచులు, 103 టీ20లు ఆడాడు. మొత్తంగా 8,804 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక స్కోరు ఫించ్ (172) పేరుమీదే ఉంది. 2014, 2018లో టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌ను కూడా ముద్దాడాడు. ఇక, ఫించ్ సారథ్యంలో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో విజయం సాధించి ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

