Tokyo Olympics: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మర్
ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మర్‌గా ఆమె నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా మెక్కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది.

టోక్యో: ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో 7 మెడల్స్ గెలిచిన తొలి ఫిమేల్ స్విమ్మర్‌గా ఆమె నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా మెక్కియోన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఆమెతోపాటు కేలీ మెక్కియోన్, చెల్సీ హాడ్జెస్, కేట్ క్యాంప్బెల్లతో కూడిన ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అమెరికాకు షాకిచ్చింది.
ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో మెక్కియోన్ మొత్తం మెడల్స్ సంఖ్య ఏడుకి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లో ఇన్ని మెడల్స్ గెలిచిన మరో మహిళా స్విమ్మర్ లేకపోవడం విశేషం. 27 ఏళ్ల మెక్కియోన్ నాలుగు గోల్డ్ మెడల్స్, మూడు బ్రాంజ్ మెడల్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఈస్ట్ జర్మనీకి చెందిన క్రిస్టిన్ ఒటో (1952లో 6 మెడల్స్), అమెరికాకు చెందిన నటాలీ కఫ్లిన్ (2008 ఒలింపిక్స్) పేరిట ఉన్న రికార్డును మెక్కియోన్ చెరిపేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking water | ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు : వీడియో
Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

