AUSvsPAK 1st Test : తొలి టెస్టుకు ఇరుజట్ల ప్రకటన.. వరల్డ్ కప్ హీరోకు వైస్ కెప్టెన్సీ.. స్టార్ బ్యాటర్‌ను తప్పించిన పాక్
AUSvsPAK 1st Test : గురువారం నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వేదికగా పాకిస్తాన్‌తో జరుగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు తమ ఫైనల్ లెవెన్‌ను ప్రకటించాయి.
AUSvsPAK 1st Test : గురువారం నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వేదికగా పాకిస్తాన్‌తో జరుగనున్న తొలి టెస్టుకు ఇరు జట్లు తమ ఫైనల్ లెవెన్‌ను ప్రకటించాయి. ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ హీరో, ఈ ఏడాది ఆ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది. స్టార్ స్పిన్నర్ నాథన్ లియన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ కూడా స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను పక్కనబెట్టి ఇద్దరు కొత్త ఆటగాళ్లకు తుది జట్టులోకి అవకాశమిచ్చింది.
పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్‌కు ఉస్మాన్ ఖవాజాతో పాటు తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్నాడు. మూడో స్థానంలో మార్నస్ లబూషేన్ రానుండగా ఆ తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీలతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. పేస్ త్రయం మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్తో పాటు స్పిన్నర్ నాథన్ లియాన్లు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. లియాన్ ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే.
ఆసీస్ జట్టు : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హెజిల్వుడ్
రిజ్వాన్ ఔట్.. సర్ఫరాజ్‌కు ఛాన్స్
మరోవైపు బాబర్ ఆజమ్ సారథిగా తప్పుకున్నాక షాన్ మసూద్ సారథ్యంలో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్.. తుది జట్టులో రిజ్వాన్‌ను తప్పించింది. మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్‌ను ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. ఆల్ రౌండర్ అమీర్ జమాల్‌తో పాటు బౌలర్ ఖుర్రమ్ షాజాద్‌లు తుది జట్టులో ఉన్నారు. పేసర్లకు అనుకూలంగా ఉండే ఆసీస్ పిచ్‌లపై షహీన్ అఫ్రిది, అమీర్ ఖుర్రమ్, అమీర్ జమాల్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరం. తమ ప్రధాన స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో పాక్.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ల మీదే ఆధారరపడనుంది.
పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ సర్ఫరాజ్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రఫ్, షహీన్ షా అఫ్రిది, అమీర్ జమాల్, ఖర్రమ్ షాజాద్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

