IND vs AUS : తొలి వన్డేలో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, పర్యాటక జట్టు స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 188 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ (81) కొట్టిన మిచెల్ మార్ష్ (mitchell marsh)ఆ జట్టులో టాప్ స్కోరర్. 174 రన్స్ వద్ద ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా మరో 14 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయి. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ తలా మూడేసి వికెట్లు తీశారు. జడేజా రెండు, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బౌండరీలు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 రన్స్ కొట్టాడు. లబుషేన్‌తో కలిసి మూడో వికెట్‌కు 52 రన్స్ జోడించాడు. 129 పరుగుల వద్ద జడేజా, మార్ష్‌ను ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్ (26), కామెరూన్ గ్రీన్ (12), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (8), మార్కస్ స్టోయినిస్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. భారత భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో ఆసీస్ స్కోర్‌బోర్డు నెమ్మదించింది.