Aus vs WI Test: ఆసీస్‌ను వణకిస్తున్న విండీస్ పేసర్లు.. 24 పరుగులకే నాలుగు వికెట్లు
Aus vs WI Test: రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెస్టిండీస్ అదరగొడుతున్నది. రెండో రోజు టీ విరామానికి ఆసీస్.. ఐదు ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.
Aus vs WI Test: ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వెస్టిండీస్ అదరగొడుతున్నది. గురువారమే మొదలైన ఈ డే అండ్ నైట్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కెవెమ్ హాడ్జ్ (71), జోషువా డిసిల్వ (79)త ఓపాటు కెవిన్ సింక్లెయిర్ (50), అల్జారీ జోసెఫ్ (32)లు రాణిచండంతో తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం విండీస్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను వణికిస్తున్నారు. రెండో రోజు టీ విరామానికి ఆసీస్.. ఐదు ఓవర్లలో 24 పరుగులు చేసి ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది.
విండీస్‌ను ఆలౌట్ చేసిన ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిరాగానే భారీ షాక్‌లు తాకాయి. కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (6), మార్నస్ లబూషేన్ (3), కామెరూన గ్రీన్ (8), ట్రావిస్ హెడ్ (0)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. మూడు ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం.
KEMAR ROACH ON FIRE…!!! 🔥
Australia 24/4 in the Pink Ball Test. pic.twitter.com/d7bCih69wI
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2024
రోచ్ వేసిన తొలి ఓవర్లో ఆఖరి బంతికి స్మిత్ ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించగా అల్జారీ జోసెఫ్ వేసిన మరుసటి ఓవర్లో లబూషేన్.. కెవిన్ సింక్లయిర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన రోచ్ ఆసీస్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో రోచ్.. గ్రీన్‌తో పాటు హెడ్‌ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. టీ విరామానికి ఉస్మాన్ ఖవాజా (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. కీమర్ రోచ్.. 3 ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్.. ఇంకా 287 పరుగులు వెనుకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

