AUS vs WI: అబాట్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌దే వన్డే సిరీస్
AUS vs WI: పేస్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ బంతితో మూడు వికెట్లు తీయడమే గాక బ్యాట్ తోనూ రాణించడంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది.
AUS vs WI: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన రెండో వన్డేలో కంగారూలు.. కరేబియన్ జట్టును 83 పరుగుల తేడాతో ఓడించారు. పేస్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ బంతితో మూడు వికెట్లు (3/40) పాటు బ్యాట్ (63 బంతుల్లో 69, 1 ఫోర్, 4 సిక్సర్లు) తోనూ రాణించడంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో స్టీవ్ స్మిత్ సేన.. 2-0 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన విండీస్.. ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. విండీస్ సారథి షై హోప్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విండీస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. వంద పరుగుల లోపే ఆసీస్.. ఐదు వికెట్లను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేక్ ఫ్రేసర్ (10)తో పాటు గత మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జోష్ ఇంగ్లిస్ (9) విఫలమయ్యారు.
కామెరూన్ గ్రీన్ (33) ఫర్వాలేదనిపించినా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (33), మార్నస్ లబూషేన్ (26)లు విఫలమయ్యారు. మాథ్యూ షార్ట్ (41) ఆసీస్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సీన్ అబాట్.. సదర్లండ్ (18) అండతో ఆసీస్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అబాట్ పోరాటంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లు తీయగా రొమారియా షెపర్డ్, అల్జారీ జోసెఫ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
A stunning knock from SEAN Abbott! ⚡️⚡️
What an effort at his home ground!
Brilliant fifty 🙌🏻 #AUSvsWI #AUSvWI pic.twitter.com/NNOQtmlnbl— Aussies Army🏏🦘 (@AussiesArmy) February 4, 2024
లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఆ జట్టులో ఒక్కరు కూడా అర్థ సెంచరీలు చేయకపోవడంతో పాటు భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమైంది. కీస్ కార్టీ ఒక్కడే 40 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలిచాడు. షై హోప్ (29), రోస్టన్ ఛేజ్ (25)లు ఫర్వాలేదనిపించారు. కంగారూల ధాటికి విండీస్.. 43.3 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్, అబాట్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టగా విల్ సదర్లండ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఆఖరి వన్డే ఈనెల 6న కాన్బెర్రా వేదికగా జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

