AUS vs SL | ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
AUS vs SL | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతన్న మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వేగంగా ఆడలేకపోయింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతన్న మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వేగంగా ఆడలేకపోయింది. కుశాల్ మెండిస్ (5) విఫలమవగా.. పాథుమ్ నిస్సంక (40) వన్డే తరహాలో ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వ (26) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. చరిత్ ఆసలంక (38 నాటౌట్) ధాటిగా ఆడగా.. అతనికి భానుక రాజపక్స (7), దాసున్ షనక (3), వానిందు హసరంగ (1) ఏమాత్రం సహకారం అందించలేకపోయారు.
చివర్లో చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో శ్రీలంక జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు.
Charith Asalanka helps Sri Lanka put up a fighting total 😯#AUSvSL | #T20WorldCup | 📝: https://t.co/cwIkvUCvbM pic.twitter.com/7QzoZoCC1c
— ICC (@ICC) October 25, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

