AUS vs SL | జోరు పెంచిన ఆసీస్.. పది ఓవర్లకు స్కోరు ఎంతంటే?
AUS vs SL | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు జోరు పెంచారు. డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినా..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు జోరు పెంచారు. డేవిడ్ వార్నర్ (11), మిచెల్ మార్ష్ (18) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (23 నాటౌట్) నెమ్మదిగా ఇన్నింగ్స్ వేగం పెంచాడు. మార్ష్ అవుటైన తర్వాత అతనికి జత కలిసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 22 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
దీంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదని ఆసీస్ జట్టు.. ఆ తర్వాత నాలుగు ఓవర్లలో ఏడు బౌండరీలు బాదింది. వీటిలో మ్యాక్స్‌వెల్ ఒక్కడే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ జట్టు పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులతో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

