AUS vs SL | ఛేజింగ్‌లో ఆసీస్‌కు దక్కని శుభారంభం.. పవర్‌ప్లే స్కోరు ఎంతంటే?
AUS vs SL | శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టును లంక పేసర్లు కట్టడి చేశారు.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టును లంక పేసర్లు కట్టడి చేశారు. దీంతో పవర్‌ప్లేలో భారీ షాట్లు ఆడటంలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (11), ఆరోన్ ఫించ్ (9 నాటౌట్) ఇద్దరూ విఫలమయ్యారు. ముఖ్యంగా ఫించ్ జిడ్డు బ్యాటింగ్‌తో వార్నర్‌పై ఒత్తిడి పెంచాడు.
ఇలాంటి సమయంలో ఐదో ఓవర్లో తీక్షణ బౌలింగ్‌కు వచ్చాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వార్నర్.. లంక కెప్టెన్ షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ వచ్చినా కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టానికి 33 పరుగులతో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

