ధోనీ గన్షాట్ను సెలబ్రేట్ చేసుకున్న పాకిస్థాన్ బ్యాటర్

దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ దూసుకెళ్తుతున్నది. గ్రూప్ 2లో ఆడిన మూడు మ్యాచుల్లో నెగ్గిన ఆ జట్టు.. సెమీస్‌కు దాదాపు బర్త్ను ఖరారు చేసుకున్నది. అయితే శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ పవర్ షాట్లతో హోరెత్తించాడు. 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టి.. అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే ఆ స్టన్నింగ్ విక్టరీ తర్వాత పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టయిల్లో ఆ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. గతంలో ధోనీ ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. గన్ షాట్ సెలబ్రేట్ చేసుకునేవాడు. షాట్ కొట్టిన తర్వాత.. బ్యాట్‌ను గన్ ట్రిగ్గర్ నొక్కినట్లు ఫోజు ఇస్తూ ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేసేవాడు. అయితే ఇక ఓటమి తప్పదేమో అనుకున్న సమయంలో.. భారీ సిక్సర్లతో అలరించిన అసిఫ్ అలీ కూడా ధోనీ తరహాలోనే ఆ చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. నాలుగు భారీ సిక్సర్ల తర్వాత తన బ్యాట్‌తో గన్‌షాట్ ఫోజు ఇచ్చి సంబరాల్లో తేలిపోయాడు. అసిఫ్ అలీ గన్‌షాట్ ఫోజుపై ట్విట్టర్లో క్రికెట్ అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ధోనీని అలీ అనుకరించినట్లు కొందరు ట్వీట్లు చేశారు.
వాస్తవానికి 2005లో జైపూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తొలిసారి గన్‌షాట్ ఫోజు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 183 రన్స్ చేసిన అతను ఆ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. 16 ఏళ్ల క్రితం ధోనీ ఇచ్చిన స్టంట్ తరహాలోనే అసిఫ్ అలీ ఇప్పుడు ఎంజాయ్ చేశాడు. ధోనీ ఆ తర్వాత కూడా పలు మార్లు విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత గన్‌షాట్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో అసిఫ్ అలీ కేవలం 7 బంతుల్లో 25 రన్స్ చేశాడు. కరీమ్ జానత్ వేసిన 19వ ఓవర్లో 4 సిక్సర్లు కొట్టాడు. 12 బంతుల్లో 24 రన్స్ అవసరమైన సమయంలో అలీ ఆ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ అసిఫ్ అలీ తన పవర్ గేమ్ ట్యాలెంట్‌ను చూపించాడు. రెండు మ్యాచుల్లో అతను ఇప్పటికే ఏడు సిక్సర్లను కొట్టడం విశేషం.
Close enough
— Bhanu Kumar Jha (@BhanuKumarJha) October 29, 2021
#AsifAli#PAKvAFG #T20WorldCup #Pak #Afganisthan pic.twitter.com/bKyNHsQF9Q
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

