Home
Sports
Asian Games 2023 Shooter Kyan Bags Bronze In Mens Trap Event Indias 42nd Medal At 19th Asiad
Asian Games-2023 | షూటింగ్లో భారత్‌కు మరో పతకం.. మెన్స్ ట్రాప్ ఈవెంట్లో క్యాన్ చెనాయ్‌కి కాంస్యం
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు.
హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల సంట పండిస్తున్నారు. ఇప్పటికే 7 స్వర్ణాలు సహా మొత్తం 21 పతకాలు తమ ఖాతాలో వేసుకున్న భారత షూటర్లు ఇప్పుడు మరో పతకం సాధించారు. మెన్స్ ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో షూటర్ క్యాన్ చెనాయ్ 32/40 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు.
ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్ జొరావర్ సింగ్ సంధూ 23/40 స్కోర్‌తో ఐదు స్థానంతో సరిపెట్టుకున్నాడు. చైనాకు చెందిన క్వి యింగ్ 46 స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, కువైట్‌కు చెందిన అల్రష్దీ తలాల్ రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా 19వ ఏషియాడ్‌లో భారత్ ఇప్పటి వరకు 42 పతకాలు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

