Asian Games 2023 | షూటింగ్లో భారత్‌కు నాలుగో పతకం.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రతాప్ తోమర్‌కు కాంస్యం
Asian Games 2023 | ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో నాలుగో పతకం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్యం సాధించాడు.
హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో నాలుగో పతకం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్యం సాధించాడు. అంతకుముందు బంగారు పతకం గెలిచిన పురుషుల టీమ్‌లో కూడా ప్రతాప్ తోమర్ ఉన్నాడు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తోమర్ 228.8 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. చైనా షూటర్ చెంగ్ లిహావో 253.3 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, కొరియా షూటర్ పార్క్ హజున్ 251.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు.
అంతకుముందు జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్, ఐశ్వరి తోమర్లతో కూడిన టీమ్ బంగారు పతకం గెలిచింది. అదేవిధంగా తొలిరోజైన ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రమిత, మొహులీ ఘోష్, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రమిత జిందాల్ కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో షూటింగ్లో పతకాల సంఖ్య నాలుగుకు, మొత్తం పతకాల సంఖ్య 9కి చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

