కరోనా ఎఫెక్ట్.. ఏషియన్ గేమ్స్-2022 నిరవధిక వాయిదా
Asian Games | ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఏషియన్ గేమ్స్ (Asian Games) వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ ఆసియా క్రీడలను నిరవధికంగా
షాంఘై: ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఏషియన్ గేమ్స్ (Asian Games) వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు చెప్పనప్పటికీ ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్రీడలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

హాంగ్జూ పట్టణంలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఏషియన్ గేమ్స్ జరగాల్సి ఉన్నాయి. అయితే చైనాలో కరోనాకు కేంద్రంగా ఉన్న షాంఘైకి సమీపంలోనే హాంగ్జూ పట్టణం ఉన్నది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి షాంఘైలో గత కొన్ని వారాలుగా కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
కాగా, ఏషియన్ గేమ్స్ కోసం హాంగ్జూ సిద్ధంగా ఉన్నదని స్థానిక ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. క్రీడల నిర్వహణకు కొత్తగా 56 స్టేడియాలను నిర్మించామని తెలిపింది. అయితే ఫిబ్రవరిలో ముగిసిన వింటర్ ఒలింపిక్స్ అనుభవాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

