ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చాలా సులభంగా గెలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్.. లంకేయులను 105 పరుగులకు కట్టడి చేసింది. రాజపక్స (38), గుణతిలక (17), కరుణరత్నే (31) తప్ప మిగతా ఎవరూ రెండంకెల స్కోరు చెయ్యలేకపోయారు. దీంతో లంక జట్టు అఫ్ఘాన్ ముందు కేవలం 106 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచింది.
ఛేజింగ్‌లో అఫ్ఘాన్‌కు హజ్రతుల్లా జజాయ్ (37 నాటౌట్), గుర్బాజ్ (40) అదిరే ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీమ్ జద్రాన్ (15) రనౌట్ అవగా.. జజాయ్‌తో జతకలిసిన నజిబుల్లా జద్రాన్ (2 నాటౌట్) లాంఛనం పూర్తిచేశాడు. దీంతో ఆ జట్టు కేవలం రెండు వికెట్లే కోల్పోయి 10.1 ఓవర్లలో 106 పరుగులు చేసి లంకను ఓడించింది. లంక బౌలర్లలో హసరంగం ఒక వికెట్ తీసుకున్నాడు.