ఆసియా కప్ మొదలైంది. అఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య దుబాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్ఘాన్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు సారధి మహమ్మద్ నబీ నమ్మకాన్ని నిలబెట్టిన బౌలర్లు.. లంకను 105 పరుగులకు ఆలౌట్ చేశారు. ట్రిక్కీగా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు లంక బ్యాటర్లు తడబడ్డారు.
కేవలం భానుక రాజపక్స (38), చమిక కరుణరత్నే (31) మాత్రమే ఫర్వాలేదనిపించారు. గుణతిలక (17) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చెయ్యలేకపోయారు. దీంతో లంక జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్ఘాన్ ముందు 106 పరుగుల టార్గెట్ నిలిపింది. అఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూకీ మూడు వికెట్లతో చెలరేగాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ చెరో రెండు వికట్లు తీసుకోగా.. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీసుకున్నాడు.