PAK vs SL | శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. మ్యాచ్ రద్దయితే భారత్‌తో ఫైనల్లో ఆడేదెవరు?
PAK vs SL | ఆసియా కప్ 2023లో ఫైనల్ ఎంట్రీ కోసం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 27 ఓవర్లు ముగిసిన తర్వాత చినుకులు మొదలయ్యాయి. దీంతో మ్యాచ్‌కు కాసేపు బ్రేక్ ఇచ్చారు. 27.4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది.
PAK vs SL | ఆసియా కప్ 2023లో ఫైనల్ ఎంట్రీ కోసం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 27 ఓవర్లు ముగిసిన తర్వాత చినుకులు మొదలయ్యాయి. దీంతో మ్యాచ్‌కు కాసేపు బ్రేక్ ఇచ్చారు. 27.4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆసియా కప్‌ను మొదట్నుంచి వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఇవాళ మ్యాచ్ ప్రారంభ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ మరోసారి వర్షం మొదలవ్వడంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చారు.
ప్రస్తుతం సూపర్ ఫోర్ దశలో ఇండియా నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉంది. ఇక లంక, పాక్‌లు రెండేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇవాళ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక పాయింట్ ఇస్తారు. రిజర్వ్ డే లేని కారణంగా కచ్చితంగా ఫైనలిస్టును తేల్చాల్సి ఉంటుంది. అప్పుడు రెండు జట్లకు మూడేసి పాయింట్లు అవుతాయి. కానీ బెటర్ రన్‌రేట్ ఉన్న శ్రీలంక.. ఫైనల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200గా ఉంది. ఇక పాకిస్థాన్ నెట్రన్ రేట్ -1.892గా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

