Ashwin | అశ్విన్ తెలివైన బౌలరే.. కానీ ఆ చివరి బంతి: ఢిల్లీ ఓటమిపై గవాస్కర్ విశ్లేషణ
Ashwin | ఐపీఎల్ 14లో ఫైనల్ చేరాలని, అక్కడ చెన్నైపై పగతీర్చుకొని టైటిల్ గెలవాలని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి.

షార్జా: ఐపీఎల్ 14లో ఫైనల్ చేరాలని, అక్కడ చెన్నైపై పగతీర్చుకొని టైటిల్ గెలవాలని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగినరెండో క్వాలిఫైయర్‌లో కోల్‌కతా చేతిలో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన వెటరన్ స్పిన్నర్ అశ్విన్ ఐదో బంతికి భారీ సిక్స్ సమర్పించడంతో జట్టు ఓటమిపాలైంది. ఈ ఓవర్ గురించి టీమిండియా మాజీ సారధి, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించాడు.
అశ్విన్ తెలివైన బౌలర్ అని మెచ్చుకున్న సన్నీ.. చివర్లో అశ్విన్ అంచనా తప్పిందని అందుకే ఢిల్లీ ఓడిపోయిందని వివరించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కావల్సి ఉండగా కెప్టెన్ రిషభ్ పంత్ బంతిని అశ్విన్ చేతికి అందించాడు. అశ్విన్ కూడా తనపై కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.
ఆ తర్వాత వరుసగా రెండు వికెట్లు కూల్చాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో 6 పరుగులకు చేరింది. అశ్విన్ వేసిన ఓవర్ 5వ బంతిని రాహుల్ త్రిపాఠీ సిక్సర్‌గా మలచడంతో కోల్‌కతా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది.
‘‘అశ్విన్ చాలా తెలివైన బౌలర్. ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి బంతులేయాలో అతనికి బాగా తెలుసు. అతను బ్యాట్స్‌మెన్ మనసు చదువుతాడు. సునీల్ నరైన్ ముందుకొచ్చి బంతిని స్టాండ్స్‌లోకి పంపాలనుకుంటున్నాడని అశ్విన్ గ్రహించాడు. అందుకే వైడర్ డెలివరీ వేశాడు. దీంతో లాంగ్ ఆన్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ చివరి బంతి వేసినప్పుడు అశ్విన్ లెక్క తప్పింది. త్రిపాఠి కూడా రన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు. అందుకే కొంచెం ఫ్లాట్‌గా బంతి వేశాడు. అయితే ఈ విషయాన్ని త్రిపాఠి కూడా గ్రహించాడు. దీంతో చివర్లో అద్భుతమైన షాట్ ఆడి మ్యాచ్ ముగించాడు’’ అని గవాస్కర్ వివరించాడు.
అయితే ఈ మ్యాచ్ ఇలా చివరి బంతి వరకూ రావడానికి కారణం కోల్‌కతా వైఫల్యమే అని విమర్శించాడు. కేకేఆర్ జట్టు మరో 10 బంతులుండగానే గెలవాల్సిన మ్యాచ్‌ను ఇలా చివరి బంతి వరకూ లాక్కొచ్చిందని లిటిల్ మాస్టర్ వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

