Malaysia Masters | రెండో రౌండ్లో హరిహరన్ – అర్జున్ జోడీ.. మెయిన్ డ్రాకు అశ్మిత..!
Malaysia Masters : మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మెరిశారు. మహిళల సింగిల్స్‌లో అశ్మిత చలిహ (Ashmita Chaliha) ముందంజ వేయగా.. పురుషుల డబుల్స్‌లో హంసకరుణన్ - అర్జున్ జోడీ సంచలన విజయంతో పొపోవ్ సోదరులకు చెక్ పెట్టింది.
Malaysia Masters : మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు మెరిశారు. మహిళల సింగిల్స్‌లో అశ్మిత చలిహ (Ashmita Chaliha) మెయిన్ డ్రాకు అర్హత సాధంచగా.. పురుషుల డబుల్స్‌లో హంసకరుణన్ – అర్జున్ జోడీ సంచలన విజయంతో ఏడో సీడ్ పొపోవ్ సోదరులకు చెక్ పెట్టింది. వారం క్రితం థామస్ కప్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి వారిపై ప్రతీకారం తీర్చుకొని రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత ద్వయం హరిహరన్ – అర్జున్ ధాటికి క్రిస్టో పొపోవ్ – తొమా జూనియర్ పొపోవ్(ఫ్రాన్స్) తోకముడిచారు. వరస సెట్లలో జోరు చూపి 21-19, 21-15తో పొపోవో సోదరులను ఇంటికి పంపింది. తర్వాతి మ్యాచ్‌లో లియో రాలీ కర్నాండో – డానియెల్ మార్టిన్ (ఇండేనేషియా) లేదా హు కె యువాన్ – లిన్ గ్జియాంగ్ యూ( చైనా) జోడీతో భారత ద్వయం తలపడనుంది.
Huge Win For Arjun/Hariharan 💥
They Defeated The 7th Seeded French Pair Popov Brothers In Straight Games 21-19 , 21-15
R16 Against Carnando/Marthin 🇮🇩 OR Hu/Lin 🇨🇳#MalaysiaMasters2026 https://t.co/oZya7yPr9F pic.twitter.com/8qxL14dzPv
— Badminton Media (@BadmintonMedia1) May 19, 2026
తొలి సెట్ కోల్పోయినా..
మహిళల సింగిల్స్‌లో అశ్మిత చలిహ అదరగొట్టింది. మంగళవారం హోరాహోరీ మూడు సెట్ల పోరులో చైనీస్ తైపీ షట్లర్ ప యూ పొను చిత్తు చేసింది. మూడు సెట్ల పోరులో తొలి సెట్‌ను 23-21తో కోల్పోయినా అశ్మిత ఒత్తిడికి లోనవ్వలేదు.
రెండో సెట్లో ప యూ వ్యూహాల్ని ఛేదిస్తూ 21-16తో గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన భారత స్టార్ 21-16తో ముగించి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మెయిన్ డ్రా తొలి రౌండ్లో ఆమె 56వ ర్యాంకర్ థలితా రమధాని విర్యవన్(ఇండోనేషియా)ను ఢీకొట్టనుంది.
Ashmita Chaliha moves to the Main Draw after winning against Pai Yu Po in three games , a solid comeback in the latter half of the decider to win 10 of the next 14 points from 11-12
21-23,21-16,21-16
R32 vs Thalita or Chen Su Yu pic.twitter.com/vIU6gNyJNi— Just Badminton (@BadmintonJust) May 19, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

