AUS vs ENG | ఓవల్: యాషెస్ సిరీస్‌లో ఐదో టెస్టును ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. వర్షం అంతరాయం మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పైచేయి అయ్యింది. ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో స్టోక్స్‌సేన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 334 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 135తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌ను వోక్స్ (4/50), మొయిన్ అలీ (3/76) ఘోరంగా దెబ్బతీశారు.
ఉస్మాన్ ఖవాజా (72), వార్నర్ (60), స్మిత్ (54) అర్ధసెంచరీలతో పోరాడారు. కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న బ్రాడ్ (2/62)కు రెండు వికెట్లు దక్కాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. వోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు స్టార్క్‌తో కలిసి సిరీస్ దక్కింది.