Arshdeep Sigh : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత పేసర్ అర్ష్‌దీస్ సింగ్(Arshdeep Sigh) సెంచరీ కొట్టేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన ఈ ఎడమచేతి వాటం పేసర్ ఈసారి ఐపీఎల్‌లోనూ శతక వికెట్ల క్లబ్లో చేరాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings) పేస్ అస్త్రమైన అర్ష్‌దీప్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటర్ రియాన్ రికెల్టన్ను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఐపీఎల్లో ఈ మైలురాయికి చేరుకున్న ఐదో బౌలర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడీ స్పీడ్‌స్టర్.
ఐపీఎల్లో గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ పంతొమ్మిదో సీజన్లో వికెట్ల పండగ చేసుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్ వికెట్ తీసి వంద వికెట్ల వీరుడిగా అవతరించాడు. తద్వారా ఈ లీగ్‌లో 100 వికెట్ల వీరుల జాబితాలో చేరిపోయాడీ పేసర్.
Back-to-back breakthroughs 🎯
A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX
— IndianPremierLeague (@IPL) April 16, 2026
అర్ష్‌దీప్ కంటే ముందు ముగ్గురు భారతీయులు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. వెటరన్ జహీర్ ఖాన్(102 ), అశిశ్ నెహ్రా(106), జయదేవ్ ఉనాద్కాట్(114)లు వంద క్లబ్లో చేరారు. వీరిలో నెహ్రా, జహీర్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకగా.. ఉనాద్కాట్ ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రెంట్ బౌల్ట్ 144 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
#MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯
🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ
— IndianPremierLeague (@IPL) April 16, 2026