Arshdeep Singh | అర్ష్‌దీప్ అరుదైన ఘనత.. టీ20 వేగంగా 100 వికెట్ల తీసిన భారత బౌలర్‌గా రికార్డు..!
Arshdeep Singh | ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఒక వికెట్‌ను పడగొట్టి అంతర్జాతీయ టీ20లో వంద వికెట్ల తీసిన భారతీయ బౌలర్‌గా ఘనత సాధించాడు.
Arshdeep Singh | ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఒక వికెట్‌ను పడగొట్టి అంతర్జాతీయ టీ20లో వంద వికెట్ల తీసిన భారతీయ బౌలర్‌గా ఘనత సాధించాడు. అబుదాబిలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ, ఈ ఇద్దరు జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.
ఇక టీ20లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20లో వంద వికెట్లు తీసిన ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మూడో బౌలర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన రికార్డు ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఉన్నది. కేవలం 53 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరాడు. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు సాధించాడు. అర్ష్‌దీప్ తర్వాత.. పాకిస్తాన్‌కు చెందిన హారిస్ రౌఫ్ (71 మ్యాచ్‌లు), ఐర్లాండ్‌కు చెందిన మార్క్ అడైర్ (72 మ్యాచ్‌లు) ఈ జాబితాలో ఉన్నారు.
ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ చెరో వికెట్ తీశారు. ఇది భారత జట్టుకు 250వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. టైటిల్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టిన భారత్‌కు ఆరంభం బలంగానే లభించింది. తొలి మ్యాచ్‌లో యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి సూపర్ ఫోర్ దశకు చేరుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

