హాంకాంగ్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చేతిలో ఓటమిపాలైన కార్ల్‌సన్‌కు ఈసారి మరో యువ జీఎం ఇరిగేసి అర్జున్ నుంచి దిమ్మతిరిగే షాక్ ఎదురైంది.
ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టీమ్చాంపియన్షిప్లో భాగంగా గురువారం జరిగిన ఆరో రౌండ్ పోరులో తెలంగాణకు చెందిన అర్జున్..కార్ల్‌సన్‌పై చిరస్మరణీయ విజయం సాధించాడు. టీమ్ ఎమ్‌జీడీ1 తరఫున బరిలోకి దిగిన అర్జున్..30 ఎత్తుల్లోనే కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. నల్లపావులతో గేమ్ ఆడిన అర్జున్..ఈ నార్వే స్టార్ ప్లేయర్‌కు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. టీమ్ ఎమ్‌జీడీ1 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, డ్రాగన్ చిల్లింగ్(14) అగ్రస్థానంలో ఉంది.