Andrew Tye | టీ20ల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఆండ్రూ టై.. రషీద్ ఖాన్‌ను దాటేశాడు
పొట్టి క్రికెట్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్లో వేగంగా (211 మ్యాచుల్లో ) 300 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రషీద్ ఖాన్ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు.
Andrew Tye : పొట్టి క్రికెట్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఈ ఫార్మాట్లో వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. 211 మ్యాచుల్లోనే అతను ఈ ఘనత సాధించడం విశేషం. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రికార్డును ఆండ్రూ టై బ్రేక్ చేశాడు. రషీద్ 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు.
మూడో స్థానంలో మలింగ
పొట్టి క్రికెట్లో అతి తక్కువ మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 222 మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. 2020లో రషీద్ ఖాన్, మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. సీపీఎల్ టోర్నీలో బార్బడోస్ ట్రిడెంట్కు ఆడిన అతను సెయింట్ లూసియా జౌక్స్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని ఔట్ చేయడంతో 300 వికెట్ల క్లబ్లో చేరాడు.
5 వికెట్ల తేడాతో విజయం
బిగ్‌బాష్ లీగ్‌లో ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో అతను 26 వికెట్లు నేలకూల్చి పెర్త్ స్కార్చెర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చెర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. పెర్త్ స్కార్చెర్స్ 19.2 ఓవర్లోనే లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా తరఫున 2016- 2021 మధ్య ఆండ్రూ టై 32 టీ20లు ఆడాడు. 47 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

