Hanuma Vihari | మణికట్టు గాయాన్ని లెక్కచేయని విహరి.. రంజీ ట్రోఫీలో లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్
ఆంధ్రా కెప్టెన్ హనుమా విహరి మణికట్టు గాయం వేధిస్తున్నా కూడా రంజీ ట్రోఫీలో బ్యాటింగ్ చేశాడు. అయితే.. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతను లెఫ్ట్ హ్యాండర్‌గా బరిలోకి దిగాడు.
Hanuma Vihari : ఆంధ్రా కెప్టెన్ హనుమా విహరి మణికట్టు గాయం వేధిస్తున్నా కూడా రంజీ ట్రోఫీలో బ్యాటింగ్ చేశాడు. అయితే.. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతను లెఫ్ట్ హ్యాండర్‌గా బరిలోకి దిగాడు. మధ్యప్రదేశ్, ఆంధ్రా జట్ల మధ్య ఈరోజు క్వార్టర్ ఫైనల్లో పోరు మొదలైంది. ఆంధ్రా జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. విహరి 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవేశ్ ఖాన్ ఓవర్లో బంతి అతని ఎడమచేతి మణికట్టుకు బంతి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడుతూ విహరి రిటౌర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అయితే.. జట్టు 353 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో చివరి వికెట్‌గా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే మళ్లీ మణికట్టుకు గాయం కాకుండా ఉండేందుకు లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు. దాంతో, అతని మనోధైర్యాన్ని కామెంటేటర్లు, అభిమానులు అభినందించారు.
అయ్యర్ రాకతో…
గత ఏడాది వరకు విహరి భారత టెస్టు జట్టులో కీలకమైన ఆటగాడు. మిడిల్ ఆర్డర్లో పూజారాతో కలిసి అడ్డు గోడలా నిలిచేవాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అదరగొట్టాడు కూడా. కానీ, శ్రేయాస్ అయ్యర్ రాకతో విహరికి జట్టులో పోటీ మొదలైంది. ఈ నెలలో స్వదేశంలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లకు 17మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఆరంగ్రేటం చేయనున్నారు.
— cricket fan (@cricketfanvideo) February 1, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

