Leander Paes | టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లియాండర్ పేస్.. విజయ్ అమృత్రాజ్కూ చోటు
భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ఇద్దరూ ‘ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా టెన్నిస్ ప్లేయర్లుగా నిలిచారు.
Leander Paes | ఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ఇద్దరూ ‘ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆసియా టెన్నిస్ ప్లేయర్లుగా నిలిచారు. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పేస్ తన సుదీర్ఘ కెరీర్లో 8 పురుషుల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స టైటిల్స్ నెగ్గాడు.
‘ప్లేయర్ కేటగిరీ’లో పేస్‌కు ఈ గౌరవం దక్కింది. ఇక భారత పాతతరం టెన్నిస్ దిగ్గజం అమృత్‌రాజ్‌కు ‘కాంట్రిబ్యూటర్ కేటగిరీ’లో గుర్తింపు దక్కింది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా అమృత్‌రాజ్ రికార్డులకెక్కాడు. భారత్ నుంచి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 18వ ర్యాంకు (పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికీ ఇదే అత్యుత్తమం) సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

