GG vs UPW | రెండు వికెట్లు కోల్పోయిన యూపీ.. స్కోర్ ఎంతంటే..?
WPL 2023: యూపీ వారియర్స్(UP Warriorz) బిగ్ వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలిసా హీలీ (12) ఔటయ్యింది. మోనికా పటేలో వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన ఆమె ఐదో బంతికి భారీ షాట్ ఆడింది. బౌండరీ దగ్గర హర్లీన్ డియోల్ క్యాచ్ పట్టడంతో అలిసా వెనుదిరిగింది.
GG vs UPW : యూపీ వారియర్స్(UP Warriorz) స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హిట్టర్ కిరణ్ నవగిరే (4) రెండో వికెట్‌గా వెనుదిరిగింది. కిమ్ గార్త్ (Kim Garth) ఓవర్లో షార్ట్ పిచ్ బంతికి మిడాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. అంతకుముందు ఓవర్లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అలిసా హీలీ (12) ఔటయ్యింది. పేసర్ మోనికా పటేలో వేసిన రెండో ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడింది. బౌండరీ దగ్గర హర్లీన్ డియోల్ క్యాచ్ పట్టడంతో అలిసా వెనుదిరిగింది. ప్రస్తుతం దేవికా వైద్య (3), తహ్లియా మెక్‌గ్రాత్ (0) క్రీజులో ఉన్నారు. మూడు ఓవర్లకు యూపీ స్కోర్.. 19/2.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 178 పరుగులు కొట్టింది. అష్ గార్డ్నర్(60), దయలాన్ హేమలత (57) అర్ధ శతకాలతో చెలరేగారు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ గుజరాత్‌ను వీళ్లిద్దరూ ఆదుకున్నారు. యూపీ బౌలర్లపై విరుచుకు పడుతూ ఎడాపెడా బౌండరీలు బాదారు. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.యూపీ బౌలర్లలో పర్షవీ చోప్రా, రాజేశ్వరీ గైక్వాడ్ రెండేసి వికెట్లు తీశారు. సోఫీ ఎకిల్‌స్టోన్, అంజలీ సర్వానీకి ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

