శాట్ అధికారుల అవినీతి ఆరోపణలపై క్రీడాశాఖ మంత్రి సమాధానం చెప్పాలె
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యుడు, భారత వాలీబాల్ మాజీ ఆటగాడు రవికాంత్ రెడ్డి చేసిన విమర్శలు రాష్ట్రంలో క్రీడారంగ దుస్థితికి అద్దం పడుతున్నాయని శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
- మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్
- శాట్, టీఓఏ గ్రూపు రాజకీయాలతో క్రీడాకారులు నష్టపోతున్నారని విమర్శ
హైదరాబాద్, ఆట ప్రతినిధి : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యుడు, భారత వాలీబాల్ మాజీ ఆటగాడు రవికాంత్ రెడ్డి చేసిన విమర్శలు రాష్ట్రంలో క్రీడారంగ దుస్థితికి అద్దం పడుతున్నాయని శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సమీపిస్తున్న వేళ క్రీడాశాఖ నిర్లక్ష్యం, శాట్‌లోని అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అంతర్గత తగాదాల వల్ల క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై శాట్‌లోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై క్రీడామంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే స్పందించి సమాధానం చెప్పాలన్నారు.
గత రెండేండ్లలో నిర్వహించిన స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లు, వాటి ఖర్చులపై క్రీడాశాఖ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు గత ఏడాది కాలంగా నగదు ప్రోత్సాహకాలు అందలేదని, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినా అధికారుల తీరు మారలేదని ఆయన మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు, క్రీడాకారుల సంక్షేమాన్ని పక్కనపెట్టి అధికారులు స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. టీఓఏ ఎన్నికలు అక్రమంగా జరిగాయని, అసలైన క్రీడా సంఘాలతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రాసిన లేఖలను శాట్ ఉన్నతాధికారులు ఎందుకు తొక్కిపెట్టారని నిలదీశారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాల పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. టీఓఏకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

