Allan Donald : వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్(Bangladesh) జట్టు చెత్త ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉపఖండ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. సమిష్ఠి వైఫల్యంతో సెమీస్ రేసులో వెనుకబడింది. దానికి తోడూ శ్రీలంక ఆల్‌రౌండర్ ఎంజెల్ మాథ్యూస్(Angelo Mathews) టైమ్డ్ ఔట్ వివాదం బంగ్లా క్రికెట్‌ను కుదిపేస్తోంది. టైమ్డ్ ఔట్ విషయంలో కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan) విభేదించిన ఆ జట్టు అలెఫాస్ట్ బౌలింగ్ కోచ్ న్ డొనాల్డ్(Allan Donald) తప్పుకోనున్నాడు.
గురువారం పుణేలో జట్టు సమావేశం సందర్భంగా అతడు తన రాజీనామా మేనేజ్మెంట్కు తెలియజేశాడు. ‘అవును.. వరల్డ్ కప్ తర్వాత బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని డొనాల్డ్ మాతో చెప్పాడు’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు అన్నారు.
నవంబర్ 6న బెంగళూరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఎంజెల్ మాథ్యూస్(Angelo Mathews) వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కోసం కెప్టెన్ షకీబుల్ హసన్ అప్పీల్ చేయడాన్ని డొనాల్డ్ తీరును తప్పుబట్టాడు. అలా చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ బహిరంగంగా విమర్శించాడు. దాంతో, షకీబ్‌పై వ్యాఖ్యలపై డొనాల్డ్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందిన నవంబర్ 8న బంగ్లా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన వెలువరించింది. దాంతో, అసంతృప్తికి లోనైన డొనాల్డ్ కోచ్‌గా తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన డొనాల్డ్.. 2022 మార్చిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాంతో, బీసీబీ అతడి సర్వీస్‌ను వరల్డ్ కప్ వరకూ పొడిగించింది.