అజాజ్ పటేల్ అద్భుతం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్

ముంబై: అజాజ్ యూనిస్ పటేల్.. పుట్టింది బాంబేలోనే.. కానీ ఆడుతోంది న్యూజిలాండ్‌కు. పుట్టిన స్వంత ఊళ్లోనే అజాజ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. నిజానికి 8 ఏళ్ల వయసులో అజాల్ ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ స్థిరపడింది. అయితే గత కొన్నేళ్ల నుంచి కివీస్‌కు ఆడుతున్న అజాజ్ పటేల్.. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. స్పిన్ బౌలింగ్‌ను చాలా కాన్ఫిడెంట్‌గా, ఈజీగా ఆడే.. భారత బ్యాటర్లను అజాజ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆజాజ్ ధాటికి ఇండియా బ్యాటర్లు క్యూకట్టారు. ఇండియాతో జరుగుతన్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Only the third bowler to claim all 10 wickets in an innings in the history of Test cricket 🔥
— ICC (@ICC) December 4, 2021
Take a bow, Ajaz Patel! #WTC23 | #INDvNZ | https://t.co/EdvFj8QtKD pic.twitter.com/negtQkbeKd
గతంలో ఈ ఘనతను అందుకున్నవారిలో ఇండియన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్లు ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే మొత్తం 10 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ అజాజ్ సూపర్ షో ధాటికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 325 రన్స్‌కు ఆలౌటైంది. మయాంక్ 150, అక్షర్ పటేల్ 52 రన్స్ స్కోర్ చేశారు. తొలి టెస్టులో ఇండియా విక్టరీని అడ్డుకున్న బ్యాటర్లలో అజాజ్ కూడా ఉన్నాడు. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి అజాజ్ చరిత్ర సృష్టించాడు. అజాజ్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లు వేసి 119 రన్స్ ఇచ్చి 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

