SRH vs PBKS : ఐపీఎల్ రికార్డ్ బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), ట్రావిస్ హెడ్(38) విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడినా.. మిడిలార్డర్ తడబాటుతో భారీ స్కోర్ చేయలేకపోయింది. అభిషేక్, హెడ్ మెరుపులతో 250 అలవోకగా కొట్టేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను పంజాబ్ కింగ్స్ పేసర్ శశాంక్ సింగ్(2-50) దెబ్బకొట్టాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్(39) దంచేసినా.. మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో హైదరాబాద్‌ను 219కే కట్టడి చేసింది పంజాబ్.
ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దుమ్మురేపారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ల భరతం పడుతూ అభిషేక్ శర్మ(74), ట్రావిస్ హెడ్(38)లు బౌండరీల మోత మోగించారు. వీరిద్దరి ఊచకోతతో ఆరు ఓవర్లకే స్కోర్ వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు శశాంక్ సింగ్(2-20) చేతికి బంతి ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఫలితం సాధించాడు. శశాంక్ వేసిన 9వ ఓవర్లో హెడ్, అభిషేక్ ఔటయ్యారు.
Applied the brakes 🚏
Terrific comeback with the ball by @PunjabKingsIPL bowlers 👏👏
Scorecard ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH pic.twitter.com/vn6NCJrtkN
— IndianPremierLeague (@IPL) April 11, 2026
తొలి బంతికి బార్ట్లెట్కు హెడ్ దొరికిపోగా.. ఎక్స్ట్రా కవర్స్ దిశగా సిక్సర్‌కు యత్నించిన అభిషేక్ బౌండరీ వద్ద అర్ష్‌దీప్ సింగ్ చేతికి చిక్కాడు. దాంతో.. 122 వద్ద సన్‌రైజర్స్ రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో హెన్రిచ్ క్లాసెన్(39), కెప్టెన్ ఇషాన్ కిషన్(20)లు ఆచితూచి ఆడుతూనే చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. రెండో వికెట్‌కు 47 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని అర్ష్‌దీప్ సింగ్ విడదీశాడు.
Innings Break!
A strong fightback by #PBKS in the field and a 🎯 of 2⃣2⃣0⃣ to chase down 👊
2⃣ points loading for?
Scorecard ▶️ https://t.co/DUNkQi9YaV#TATAIPL | #KhelBindaas | #PBKSvSRH pic.twitter.com/LpG6nCBtNm
— IndianPremierLeague (@IPL) April 11, 2026
అర్ష్‌దీప్ ఓవర్లో సిక్సర్ కొట్టాలనుకున్న ఇషాన్ బౌండరీ లైన్ వద్ద మార్కో యాన్సెన్ ఒంటిచేతి క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. తర్వాత అనికేత్ వర్మ(18) రనౌటవ్వగా.. సలీల్ అరోరా(9), క్లాసెన్ సైతం పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖరి ఓవర్లో బార్ట్లెట్ ఐదు రన్స్ మాత్రమే ఇవ్వడంతో 250 చేస్తుందనుకున్న ఆరెంజ్ ఆర్మీ.. 219 పరుగులకే పరిమితమైంది.