AUSvsPAK 3rd Test: ఫైఫర్‌తో చెలరేగిన కమిన్స్.. పాక్‌ను ఆదుకున్న రిజ్వాన్, జమల్
AUSvsPAK 3rd Test: పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ మరోసారి రెచ్చిపోయింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఈ ఏడాది టెస్టులలో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
AUSvsPAK 3rd Test: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ మరోసారి రెచ్చిపోయింది. ఈ సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మూడో టెస్టులోనూ పాక్ పనిపట్టింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఈ ఏడాది టెస్టులలో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (103 బంతుల్లో 88, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తో పాటు లోయరార్డర్లో ఆల్ రౌండర్ అమీర్ జమల్ (97 బంతుల్లో 82, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రాణించడంతో పాక్.. 77.1 ఓవర్లలో 313 పరుగులు చేయగలిగింది.
డేవిడ్ వార్నర్ చివరి టెస్టు అయిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తప్పు అని తెలియడానికి ఆ జట్టుకు పెద్దగా టైమ్ పట్టలేదు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్ బలిగొన్నాడు. తొలి టెస్టు ఆడుతున్న యువ ఓపెనర్ సయీమ్ అయూబ్ ను హెజిల్వుడ్ తన తొలి ఓవర్లో రెండో బంతికి ఔట్ చేశాడు. ఓపెనర్లిద్దరూ డకౌట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ (70 బంతుల్లో 35) కొద్దిసేపు క్రీజులో నిలిచాడు. బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 26, 4 ఫోర్లు) మరోసారి విఫలమయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ (5) కూడా బాబర్‌ను అనుసరించాడు. బాబర్, షకీల్‌లు కమిన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు.
96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రిజ్వాన్‌తో జతకలిసిన అఘా సల్మాన్ (67 బంతుల్లో 53, 8 ఫోర్లు) లు పాక్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అయితే కమిన్స్ పాక్‌ను మరోసారి దెబ్బతీశాడు. సెంచరీ దిశగా సాగుతున్న రిజ్వాన్‌ను ఔట్ చేయడంతో పాక్ మరోసారి తడబడింది. ఆ వెంటనే షకీల్, సాజిద్ ఖాన్ (15)కూడా పెవిలియన్ చేరారు. కానీ జమల్ మాత్రం పట్టుదలతో ఆడి ఆసీస్ పేస్ త్రయం (స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్)తో పాటు స్పిన్నర్ నాథన్ లియన్ను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 226కే 8 వికెట్లు కోల్పోయిన పాక్.. 313 పరుగులు చేయగలిగిందంటే అది జమల్ చలవే. చివరి వరుస బ్యాటర్ మీర్ హమ్జా (43 బంతుల్లో 7)తో కలిసి పదో వికెట్‌కు 133 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో హమ్జా చేసినవి ఏడు పరుగులే కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు ఐదు వికెట్లు దక్కగా స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. హెజిల్వుడ్, లియాన్, మార్ష్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

