గ్రౌండ్లో కుప్పకూలిన మరో ప్లేయర్

మ్యూనిక్: యూరోకప్‌లో మరో ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. 10 నుంచి 15 సెకన్ల పాటు స్పృహ కోల్పోవడంతో తోటి టీమ్ ప్లేయర్స్ ఆందోళన చెందారు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ఫ్రాన్స్ డిఫెండర్ బెంజమిన్ పవార్డ్ ప్రత్యర్థి ప్లేయర్ రాబిన్ గోసెన్స్ను ఢీకొట్టాడు. ఆ వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. సెకండాఫ్‌లో జరిగిన ఈ ఘటన తర్వాత అతనికి కొన్ని నిమిషాల పాటు అక్కడే చికిత్స చేశారు. అయితే ఆ తర్వాత అతను కోలుకోవడంతో మ్యాచ్‌లో కొనసాగాడు. అలా ఢీకొట్టడం తనకు ఓ షాక్‌లాగా తగిలిందని, కొంతసేపు తాను స్పృహ కోల్పోయానని మ్యాచ్ తర్వాత పవార్డ్ చెప్పాడు.
అయితే ఇంత జరిగినా అతన్ని మ్యాచ్‌లో కొనసాగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడు కంకషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వెంటనే బయటకు పంపించి.. సబ్‌స్టిట్యూట్‌ను దించాల్సిందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. యూరోకప్లోనే డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే గ్రౌండ్ నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో అక్కడ చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. మళ్లీ అలాంటి ఘటనే జరిగి పవార్డ్ కొంతసేపు స్పృహ కోల్పోవడంతో సాకర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

