Shapoor Zadran : అఫ్గనిస్థాన్ మాజీ క్రికెటర్ షపూర్ జద్రాన్ (Shapoor Zadran) అంత్యక్రియలు ముగిశాయి. చిన్నవయసులోనే కన్నుమూసిన అతడికి అఫ్గన్ క్రికెటర్లు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ కెప్టెన్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీలు కన్నీళ్లను దిగమింగుతూ అతడి శవపేటకను మోశారు. చరిత్రాత్మకమైన ఈద్గా మసీదులో ప్రార్థనల అనంతరం.. కాబూల్‌లో జద్రాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
అఫ్గనిస్థాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన షాపూర్ జద్రాన్ కొన్నాళ్లుగా ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడ్డాడు. రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసే హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించింది. భారత్‌లో చికిత్స పొందిన జద్రాన్ ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. మృత్యువుతో పోరాడి 38 ఏళ్ల వయసులోనే జద్రాన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. అతడి మృతదేహాన్ని విమనాంలో కాబూల్ తరలించారు.
د ارواښاد شاپور ځدراڼ جنازې مراسمو ته چارواکي، ملي لوبغاړي او زرګونه عام خلک راغلي دي.
لنډو شیبو کې به یې د جنازې مراسم پیل شي.
له #مليسپورټ سره پاتې شئ! pic.twitter.com/1QYmIfrej7
— RTA Sport (@SportRta) July 9, 2026
పదిహేడేళ్ల క్రితం అఫ్గనిస్థాన్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షపూర్ జద్రాన్‌కు నిరుడు అక్టోబర్ నుంచి అరోగ్యం సరిగా లేదు. వైద్య పరీక్షల అనంతరం అతడికి హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) అనే ప్రాణాంతకమైన జబ్బు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మామూలుగా చిన్న పిల్లల్లో కనిపించే ఈ జబ్బు 37 ఏళ్ల షపూర్‌లో కనిపించడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమస్య కారణంగా ఇన్నిరోజులు షపూర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు.

హెచ్ఎల్హెచ్ సమస్య కారణంగా వాపు ఎక్కువవుతాయి. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం మూలంగా.. ఎముకల మజ్జ, కాలేయం, ప్లీహం, లింఫ్ గ్రంథులు వంటి వాటి పనితీరు దెబ్బ తింటాయి. ఆరడుగుల 2 ఇంచుల పొడవుండే షపూర్ జులపాల జుత్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 80 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడీ పేసర్. 2009 నుంచి 2020 మధ్య కాలంలో ఈ పొడగరి స్పీడ్‌స్టర్ 44 వన్డేలు, 36 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.