Abhishek Sharma | ఉప్పల్‌లో అభిషేక్ సునామీ.. 15 బంతుల్లో మెరుపు అర్ధ శతకం..!
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఉప్పల్ స్టేడియంలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఉప్పల్ స్టేడియంలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మాథ్యూ షార్ట్ వేసిన 5వ ఓవర్లో రెచ్చిపోయిన అభిషేక్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఈ చిచ్చరపిడుగు కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ సంచలనం అభిషేక్ శర్మ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈసారి ఉప్పల్ మైదానంలో తన స్టయిల్ విధ్వంసంతో పూనకాలు తెప్పించిన అభి.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోసిన ఈ పవర్ హిట్టర్ పంతొమ్మిదో సీజన్లో వేగవంతమైన యాభై బాదాడు.
𝗨𝗡𝗦𝗧𝗢𝗣𝗣𝗔𝗕𝗟𝗘 🔥
Abhishek Sharma was at his brutal best against Matthew Short 👊
Relive ▶️ https://t.co/nV9SVInzhd#TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/Ir4gz2qQhe
— IndianPremierLeague (@IPL) April 18, 2026
దాంతో, సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పాడు. 2024 ఎడిషన్‌లో 16 బంతుల్లో ట్రావిస్ హెడ్, అభిషేక్‌లు ఫిఫ్టీతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) పేరిట ఉంది. 2023 సీజన్లో ఈ చిచ్చరపిడుగు కోల్‌కతాపై కేవలం 13 బంతుల్లోనే యాభైతో చరిత్ర సృష్టించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

