సహాయక కోచ్‌లుగా అభిషేక్, డోస్చెటె!
శ్రీలంకతో త్వరలో మొదలుకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టుకు అభిషేక్నాయర్, ర్యాన్‌టెన్ డోస్చెటె సహాయక కోచ్‌లుగా వ్యవహరించే అవకాశముంది.
న్యూఢిల్లీ: శ్రీలంకతో త్వరలో మొదలుకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టుకు అభిషేక్నాయర్, ర్యాన్‌టెన్ డోస్చెటె సహాయక కోచ్‌లుగా వ్యవహరించే అవకాశముంది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో చీఫ్ కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌తో కలిసి అభిషేక్, డోస్చెటె పనిచేయనున్నారు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున సేవలందించిన ఈ ముగ్గురు టీమ్ఇండియాకు కోచ్‌లుగా కొనసాగే చాన్స్ కనిపిస్తున్నది.
జాతీయ జట్టుకు మూడు వన్డేలాడిన నాయర్‌కు కోచింగ్ విషయంలో మెరుగైన అనుభవముంది. దీనికి తోడు దినేశ్‌కార్తీక్, రింకూసింగ్‌కు మానసిక సన్నద్ధత విషయంలో నాయర్ సహాయపడ్డాడు. మరోవైపు దిలీప్‌ను తిరిగి ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ఇండియా మూడు టీ20లకు తోడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

