న్యూఢిల్లీ : పిస్టల్ సిలిండర్ పేలి ఒక షూటర్ బొటనవేలు పాక్షికంగా చితికిపోయింది. గ్రీన్ఫీల్డ్లోని ఒక ప్రైవేట్ షూటింగ్ రేంజ్లో పిస్టల్‌కు గ్యాస్ ఎక్కిస్తుండగా సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పుష్పేందర్ కుమార్ అనే షూటర్ భోపాల్‌లో జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్ సందర్భంగా తన పిస్టల్‌లో గ్యాస్ నింపుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడిన వెంటనే మిలటరీ ఆస్పత్రికి తరలించారు.