Big Bash League: అఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్‌కు షాకిచ్చిన మెల్బోర్న్.. బిగ్ బాష్ లీగ్ నుంచి ఔట్..!
Big Bash League: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు మెల్బోర్న్ రెనెగేడ్స్ షాకిచ్చింది. అతడిని జట్టు నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Big Bash League: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు మెల్బోర్న్ రెనెగేడ్స్ షాకిచ్చింది. అతడిని జట్టు నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముజీబ్‌పై నిషేధం విధిస్తూ ఇటీవలే అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన ముజీబ్.. ఏడు వికెట్లు తీశాడు.
దేశానికి కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తున్నారనే కారణంగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు.. ముజీబ్‌తో పాటు పేసర్లు ఫజల్హక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్‌లు లీగ్ క్రికెట్ ఆడకుండా రెండేండ్ల పాటు నిషేధం విధించింది. అంతేగాక సొంత దేశపు కాంట్రాక్టులను కూడా ఇవ్వమని తేల్చి చెప్పింది. లీగ్‌లు ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)లను కూడా అందజేసేది లేదని స్పష్టం చేసింది. అఫ్గాన్ క్రికెట్ బోర్డు నేపథ్యంలో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
ACB’s sanctions on Mujeeb Ur Rahman come into effect 👉 https://t.co/XSVKrFidC5 #BBL13 pic.twitter.com/lh9IPgqnbD
— ESPNcricinfo (@ESPNcricinfo) January 1, 2024
బిగ్‌బాష్ లీగ్ 2023-24లో భాగంగా ఇదివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన మెల్బోర్న్ రెనెగేడ్స్.. ఒక్క మ్యాచ్‌లో మాత్రం గెలిచి నాలుగింటిలో ఓడింది. నేడు (జనవరి 2) మెల్బోర్న్ స్టార్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రెనెగేడ్స్ తలపడుతున్నది. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

