FIFA World Cup | ఫిఫా వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. బెల్జియంను చిత్తు చేసిన మొరాకో
నాలుగు పాయింట్లతో నాకౌట్ అవకాశాలను మెరుగుపరుచుకున్న మొరాకో
FIFA World Cup : వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. మొరాకో జట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అల్ థుమమ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో 22వ ర్యాంక్‌లో ఉన్న మొరాకో, రెండో ర్యాంక్‌లో ఉన్న బెల్జియంను మట్టికరిపించింది. మొరాకో మిడ్ ఫీల్డర్ అబ్దెల్‌హమిద్ సబిరి 73వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా తొలి గోల్ అందించాడు. జకారియ అబౌఖ్లాల్ రెండో గోల్ కొట్టడంతో 2-0తో మొరాకో సంచలన విజయం నమోదు చేసింది.
మ్యాచ్ ఆరంభం నుంచి మొరాకో ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. అయితే.. చివరి నిమిషాల్లో గోల్ సాధించేందుకు బెల్జియం ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆలోపే మ్యాచ్ చేజారిపోయింది. ఈ విజయంతో మొరాకో నాలుగు పాయింట్లతో నాకౌట్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. అంతేకాదు గ్రూప్-ఎఫ్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. బెల్జియం మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గత ఏడాది వరల్డ్ కప్‌లో బెల్జియం సెమీస్ చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

