US Open | న్యూయార్క్: భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శనివారం టాప్ సీడ్ అల్కరాజ్ 6-7 (3/7), 1-6, 6-3, 3-6తో మూడో సీడ్ డానియల్ మెద్వెదెవ్ చేతిలో ఓడాడు.
దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరులో అల్కరాజ్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోగా.. మెద్వెదెవ్ 9 ఏస్‌లతో విజృంభించాడు. 45 విన్నర్లు సంధించిన అల్కరాజ్ 38 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 7-6తో బెన్ షెల్టన్ (అమెరికా)పై సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరుగనున్న తుదిపోరులో మెద్వెదెవ్‌తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. అల్కరాజ్ ఔట్