IPL 2023 | నేటి నుంచి ఐపీఎల్-16వ సీజన్ షురూ.. తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ
IPL 2023 | బంతి బంతికి ఆధిక్యం చేతులు మారే సమరాలకు.. ఒత్తిడితో నరాలు తెగే ఉత్కంఠ పోరాటాలకు.. నేడు తెరలేవనుంది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కొత్త నిబంధనలతో సరికొత్తగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.
IPL 2023 | బంతి బంతికి ఆధిక్యం చేతులు మారే సమరాలకు.. ఒత్తిడితో నరాలు తెగే ఉత్కంఠ పోరాటాలకు.. నేడు తెరలేవనుంది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కొత్త నిబంధనలతో సరికొత్తగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టాస్ తర్వాత తుది జట్టు వెల్లడి వైడ్, నోబాల్స్‌కు సమీక్ష విధానం.. ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఎన్నో కొంగొత్త నియమాలను పరిచయం చేయనున్న ఐపీఎల్-16వ సీజన్ నేటి నుంచి ప్రారంభంకానుంది.
నిన్న మొన్నటి వరకు చెట్టపట్టాలేసుకొని తిరిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇకపై ప్రత్యర్థులుగా మైదానంలో తలపడనుండగా.. బెన్ స్టోక్స్‌ను ఎలా ఔట్ చేయాలని వ్యూహాలు రచించిన రవీంద్ర జడేజా.. అతడితోనే కలిసి ప్రత్యర్థి భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్.. బాణాసంచా మోతలు, కండ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, బాలీవుడ్ తారల ఆట పాటల మధ్య శుక్రవారం షురూ కానుంది. తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మరింకెందుకు ఆలస్యం మండు వేసవిలో.. పరుగుల విందును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా కొన్ని పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్.. తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్న ఐపీఎల్ 16వ సీజన్లో.. మూడేండ్లకు ముందు మాదిరిగా సొంత మైదానంలో సగం మ్యాచ్‌లు.. మిగిలిన సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికలపై జరుగనున్నాయి. టెన్నిస్ తరహాలో సీడింగ్స్ విధానంలో జరుగనున్న గ్రూప్ దశ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై తలపడనుంది. సారథ్య బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్‌కు టైటిల్ అందించిన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. తనకు గురువైన మహేంద్రసింగ్ ధోనీతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాడు.
మరి టీమ్ఇండియా తరఫున రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా వ్యూహాలను.. ఐపీఎల్లో మినహా మరే స్థాయిలోనూ క్రికెట్‌తో కొనసాగడం లేని ధోనీ తిప్పికొడతాడా చూడాలి! శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యాతో కూడిన గుజరాత్‌ను ఎదుర్కోవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడక తప్పేలా కనిపించడం లేదు. గుజరాత్ బౌలింగ్‌కు మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, హార్దిక్ కీలకం కానుండగా.. వికెట్ కీపర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వృద్ధిమాన్ సాహా, శ్రీకర్ భరత్ రూపంలో ఇద్దరు దేశీయ వికెట్ కీపర్లు గుజరాత్‌కు అందుబాటులో ఉన్నారు. మరోవైపు మామూలు ఆటగాళ్లను సైతం మేలిమి ముత్యాలుగా మలచగల ధోనీనే సూపర్ కింగ్స్‌కు కొండంత అండ అనడంలో సందేహం లేదు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనతో బరిలోకి దిగుతున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు.
కొత్త నిబంధనలు
- ఈ ఐపీఎల్ నుంచి వైడ్, నోబాల్స్‌కు కూడా రివ్యూ చేసుకునే అవకాశం ఉంది.
- గతంలో టాస్కు ముందు జట్టు సారథులు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటిస్తూ వస్తుండగా.. ఈ సారి నుంచి టాస్ ముగిసిన తర్వాత తుది పదకొండు మందిని ఎంపిక చేసుకోవచ్చు.
- ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఈ సీజన్ నుంచి ప్రవేశ పెడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు.. ఫీల్డింగ్ సమయంలో అదనపు బౌలర్ కావాలనుకుంటే.. ఒక బ్యాటర్‌ను తప్పించి అతడి స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను బరిలోకి దింపొచ్చు.

Iplprint
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

