అబిడ్స్ ,ఆగస్టు 25: జాతీయ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన చిన్నారులు సత్తా చాటారు. నాగపూర్ వేదికగా జరిగిన.. జాతీయ స్థాయి పోటీల ట్రియోస్ విభాగంలో వైష్ణవి వ్యాస్, వృందాశ్రీ, పూరి యాదవ్‌లు.. డియోస్ విభాగంలో రుచి, వృందాశ్రీ మూడో బహుమతి అందుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ ఏరోబిక్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్ చిన్నారులను అభినందించారు.