హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసితో ప్రముఖ వ్యాపార సంస్థ క్వాంట్‌బాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అర్జున్‌కు వచ్చే ఐదేండ్ల కాలానికి గాను క్వాంట్‌బాక్స్ రూ.12.4 కోట్లు ఇవ్వనుంది. అంటే అర్జున్.. సంవత్సరానికి రెండున్నర కోట్ల చొప్పున అందుకోనున్నాడు.
చిన్నతనం నుంచే చదరంగంపై మక్కువ పెంచుకున్న ఈ వరంగల్ యువకుడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోగా.. అర్జున్ ఎదుగుదల చూసి ముచ్చటపడి అభిమానిగా మారిపోయిన క్వాంట్‌బాక్స్ సంస్థ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సింగ్ ప్రపంచ విజేతగా నిలిచే వరకు అతడికి స్పాన్సర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.