Home
Science-technology
Xiaomi 13 Lite Specifications Leaked Via Unboxing Video May Debut As Rebranded Xiaomi Civi 2
Xiaomi 13 Lite | త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి షియోమీ 13 లైట్.. ఇవీ స్పెషిఫికేషన్స్
Xiaomi 13 Lite | గ్లోబల్ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. తన షియోమీ సీవీ2 వర్షన్ ఫోన్ రీబ్రాండ్ చేసి షియోమీ 13 లైట్ వర్షన్ ఫోన్‌ను ఆవిష్కరిస్తుందని సమాచారం.
Xiaomi 13 Lite | చైనా స్మార్ట్ దిగ్గజం షియోమీ.. గ్లోబల్ మార్కెట్లోకి షియోమీ 13లైట్ ఆవిష్కరించనున్నది. గతేడాది చైనా మార్కెట్లో ఆవిష్కరించిన `షియోమీ సివి2` మోడల్ ఫోన్‌ను రీబ్రాండ్ వర్షన్ `షియోమీ 13 లైట్`ను ఆవిష్కరిస్తుందని సమాచారం. సదరు ఫోన్ హ్యాండ్సెట్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుందని, 67వాట్ల ఫాస్ట్ చార్జర్ కూడా అందజేస్తారని తెలుస్తున్నది.
షియోమీ సీవీ2 ఫోన్లో ఫీచర్లే షియోమీ 13 లైట్లో లభిస్తాయని చెబుతున్నారు. అధికారికంగా గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతిని షియోమీ వెల్లడించలేదు. ఈ నెల 27 నుంచి బార్సిలోనాలో మొదలయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ 2023)లో ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 26న భారత్ మార్కెట్లో షియోమీ 13 ప్రో ఫోన్‌ను షియోమీ ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.
ఇవీ షియోమీ 13 లైట్ స్పెషిఫికేషన్స్..
- 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్.
- 1000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, డోల్బీ విజన్ సపోర్ట్, 1920 హెర్ట్జ్ ప్లస్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం).
- స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్.
- 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
- అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్.
- ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్
- 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సర్.
- 20-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్.
- 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్.
- ఫ్రంట్‌లో రెండు 32-మెగా పిక్సెల్ కెమెరాలు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

