WhatsApp : నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండిలా
నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు | ఈరోజుల్లో వాట్సప్ వాడని వాళ్లు ఉండరు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సప్ గురించి తెలుసు

ఈరోజుల్లో వాట్సప్ వాడని వాళ్లు ఉండరు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సప్ గురించి తెలుసు. దాన్ని ఎలా వాడాలో కూడా తెలుసు. అయితే.. వాట్సప్ సంస్థ.. నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సప్ సేవలను నిలిపివేయనుంది. ఆ ఫోన్లో నవంబర్ 1 నుంచి వాట్సప్‌కు సంబంధించిన ఎటువంటి ఫీచర్లు అప్డేట్ కావు. ఇప్పటి వరకు ఉన్న వాట్సప్ వర్షన్ మాత్రమే వర్కవుట్ అవుతుంది. అప్‌గ్రేడెడ్ వర్షన్లు అందులో అప్డేట్ కావు. దీని వల్ల పూర్తి స్థాయిలో ఆ ఫోన్లలో వాట్సప్ సేవలను ఉపయోగించుకోలేరు. మరి.. ఆ ఫోన్లు ఏవి.. వాటిలో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
చెక్ చేసుకోవడం ఎలా?
దాని కోసం.. ముందు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి About phone అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీ ఫోన్లో రన్ అవుతున్న ఆండ్రాయిడ్ వర్షన్‌ను చూపిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.4 లేదా అంతకంటే తక్కువ వర్షన్ ఉంటే.. నవంబర్ 1 నుంచి మీ ఫోన్లో వాట్సప్ సేవలు నిలిచిపోతాయి. ఆండ్రాయిడ్ వర్షన్ 4.0.4 కంటే ఎక్కువ వర్షన్ ఉన్న ఫోన్‌ను తీసుకోవాల్సిందే.
ఐఫోన్ యూజర్లు అయితే.. ఐవోఎస్ 10 లేదా అంతకంటే తక్కువ వర్షన్ ఉన్న ఫోన్లో వాట్సప్ పనిచేయదు. ఐఫోన్ 5 నుంచి తర్వాత వచ్చిన మోడల్స్‌లో మాత్రమే వాట్సప్ పనిచేయనుంది. అలాగే.. జియో ఫోన్, జియో ఫోన్ 2 లాంటి ఫీచర్ ఫోన్లలో ఉండే కైఓఎస్ 2.5.0 వర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వర్షన్‌లోనే వాట్సప్ పనిచేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
WhatsApp : వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఆ ఫోన్ల లిస్టు ఇదే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే
JioPhone Next : దివాళీకి జియోఫోన్ నెక్స్ట్ విడుదల.. కన్ఫమ్ చేసిన గూగుల్ సీఈవో
Diwali Offer : దివాళీ బంపర్ ఆఫర్.. రూ.101 కే వివో ఫోన్.. త్వరపడండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
WhatsApp : వాట్సప్ బిజినెస్ అకౌంట్లో సరికొత్త ఫీచర్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

