ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి.. వాట్సప్ ఎప్పటికప్పుడు తమ యూజర్ల కోసం సరికొత్త అప్ డేట్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఇప్పటి వరకు చాలా ఫీచర్స్‌ను తీసుకొచ్చిన వాట్సప్ తాజాగా ఐఫోన్ యూజర్ల కోసం మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. View Once అనే ఫీచర్‌ను వాట్సప్ ఫర్ ఐఫోన్ వర్సన్ 2.21.150 యూజర్ల కోసం డెవలప్ చేసింది.
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే.. ఎవరికైనా పాస్ వర్డ్స్ లాంటి సెన్సిటివ్ డేటాను పంపించాలనుకుంటే వ్యూ వన్స్ అనే ఆప్షన్‌ను ఉపయోగించి పంపించుకోవచ్చు. వ్యూ వన్స్ అనే ఆప్షన్ ద్వారా ఎవరికైనా సెన్సిటివ్ డేటాను పంపిస్తే… వాళ్లు ఆ డేటాను చూడగానే.. ఆ డేటా ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఫోటోలు అయినా వీడియోలు అయినా.. ఏ డాక్యుమెంట్ అయినా సరే.. ఎదుటి వ్యక్తి చూసేయగానే.. అవి డిసప్పియర్ అయిపోతాయి. అలాగే.. మీడియా ఫైల్స్ ఫోన్లోనూ సేవ్ కావు.
అయితే.. ఒకవేళ ఆ యూజర్ మాత్రం తన దగ్గర ఆ డేటాను ఉంచుకోవాలనుకుంటే.. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్స్‌కు కూడా ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సప్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను పొందాలనుకునే వాళ్లు.. వాట్సప్ లేటెస్ట్ వర్షన్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.