WhatsApp | వాట్సాప్ కొత్త ఫీచర్.. ఆ మెసేజ్ ఇక ఒక్కసారే చూడొచ్చు!
WhatsApp | వాట్సాప్ ఇక నుంచి టెక్ట్స్ టెక్ట్స్ మెసేజ్క్కూడా వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ అమల్లోకి తేనున్నది.
WhatsApp | మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. వాట్సాప్ కూడా తన వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించడానికి అనునిత్యం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉన్నది. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తేవాడానికి కసరత్తు చేస్తున్నది.
ఇక నుంచి ఎవరైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే అది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. అదే వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ (View Once Message Feature).అంటే ఇక నుంచి ఎవరైనా మనకు పంపిన మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కుదరదన్న మాట. ఇంతకుముందు వాట్సాప్ అకౌంట్స్‌లో సభ్యులు చేసే చాట్ కొంత టైం తర్వాత ఆటోమేటిక్‌గా దిలిట్ అయ్యేలా డిస్అపియరింగ్ అనే ఫీచర్ తీసుకొచ్చింది.
ఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం ఒక్కసారి మాత్రమే కనిపించి తదుపరి కనిపించకుండా పోతాయి. దీని స్ర్కీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. వాట్సాప్ ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ మెసేజ్‌కు వర్తింప జేయాలని యోచిస్తున్నది.
టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ అమలు చేయడానికి ప్రత్యేకించి ఒక సెండ్ బటన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చునని సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

