Parental Controls | పిల్లల వాట్సప్ వాడకంపై తల్లిదండ్రులకే కంట్రోల్..కొత్త ఫీచర్లతో మెటా కీలక నిర్ణయం!
Parental Controls | సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్‌లలో తమ పిల్లల డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ, మెటా యాజమాన్యంలోని వాట్సప్ కీలక నిర్ణయం తీసుకున్నది.
Parental Controls | సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్‌లలో తమ పిల్లల డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ, మెటా యాజమాన్యంలోని వాట్సప్ కీలక నిర్ణయం తీసుకున్నది. టీనేజర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘పేరెంటల్ కంట్రోల్స్’ సదుపాయాన్ని పరిచయం చేసింది. పిల్లల అవసరాలకు అనుగుణంగా తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ఈ సెట్టింగ్స్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. మెటా వేదికల వల్ల పిల్లలపై పడుతున్న ప్రభావం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్లు, న్యాయపరమైన సవాళ్ల నేపథ్యంలో వాట్సప్ ఈ మార్పులు చేపట్టడం గమనార్హం. వాట్సప్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లు తల్లిదండ్రులకు పలు నియంత్రణ అధికారాలను ఇస్తుండటం విశేషం.
ప్రైవసీ సెట్టింగ్స్: టీనేజర్ల ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి, వారిని ఏ గ్రూప్‌లలో చేర్చాలనేది ఇకనుంచి తల్లిదండ్రులే నిర్ణయించవచ్చు. ఒకవేళ టీనేజర్లు ఈ నిబంధనలను మార్చాలనుకుంటే కూడా తల్లిదండ్రులు సెట్ చేసిన పిన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
గ్రూప్ నోటిఫికేషన్లు: పిల్లలు ఏదైనా కొత్త గ్రూప్‌లో చేరినా, గ్రూప్ నుంచి బయటకు వచ్చినా లేదా ఆ గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఉన్నట్లుండి పెరిగినా తల్లిదండ్రులకు తక్షణ సమాచారం అందుతుంది.
స్టేటస్ కంట్రోల్: పిల్లలు ఎవరి స్టేటస్లు చూడాలి? వారి స్టేటస్ ఎవరికి చూయించాలి? ఛానెల్స్ ఎలా ఉపయోగించాలనే అంశాలను నియంత్రించేందుకు పేరెంట్స్ నిఘా తప్పనిసరిగా ఉండనుంది.
భద్రతకు ఢోకా లేదు: అయితే ఈ కంట్రోల్స్ పూర్తిగా ఐచ్ఛికం. కుటుంబ అవసరాలను బట్టి వీటిని ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. పేరెంటల్ కంట్రోల్స్ ఆన్‌లో ఉన్నప్పటికీ పిల్లల వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’ పరిధిలోనే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది. అంటే ఆ సంభాషణలను తల్లిదండ్రులు లేదా వాట్సప్ కూడా చూడటం సాధ్యపడదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
KTR | కాంగ్రెస్ ‘అభయహస్తం’ హామీలన్నీ ఏమయ్యాయి?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

